గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
Chalo Delhi| ఆకేరు న్యూస్, ములుగు: ఢిల్లీలో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ – తెలంగాణ గళం, బలం కార్యక్రమానికి గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరారు. నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ఆదేశాలు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు మండల నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఢిల్లీకి పయనమయ్యారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దెల నాగమణి, గుండెబోయిన అనిల్ కుమార్ యాదవ్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు చాపల ఉమాదేవి, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు చింత క్రాంతి, మండల మహిళా అధ్యక్షురాలు వసంత, గోవిందరావుపేట ఉపసర్పంచ్ పెండం శ్రీకాంత్, జిల్లా మహిళా నాయకురాలు ఈర్ప విజయ, ములుగు మహిళా అధ్యక్షురాలు రాధిక, ములుగు పట్టణ అధ్యక్షురాలు సంధ్య, అనిత, మండల నాయకుడు తుమ్మల శివ, యూత్ కాంగ్రెస్ నాయకుడు తాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

