Power Grid Recruitment 2026
* నెల జీతం ₹40,000 – ₹1,40,000
ఆకేరు న్యూస్, డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (PGCIL) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు తీపి కబురు అందించింది. 319 ఇంజినీర్ ట్రైనీ (Engineer Trainee) పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఖాళీల వివరాలు..
మొత్తం 319 పోస్టులలో విభాగాల వారీగా ఖాళీలు..
ఎలక్ట్రికల్ (Electrical) : 250 పోస్టులు
సివిల్ (Civil) : 48 పోస్టులు
కంప్యూటర్ సైన్స్ (Computer Science) : 21 పోస్టులు
విద్యా అర్హత & వయోపరిమితి..
అర్హత : సంబంధిత విభాగంలో (Electrical/Civil/Computer Science) కనీసం 60% మార్కులతో B.E / B.Tech / B.Sc (Engineering) ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటు GATE 2026 లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి : అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు. (నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం & జీతం..
ఎంపిక ప్రక్రియ : GATE 2026 స్కోరుకు 85% వెయిటేజ్ ఇవ్వబడుతుంది. మిగిలిన 15% లో గ్రూప్ డిస్కషన్ (GD) 3%, పర్సనల్ ఇంటర్వ్యూ (PI) 12% ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం (Pay Scale) : ఎంపికైన వారికి శిక్షణ కాలంలో ₹40,000 – ₹1,40,000 పే స్కేల్‌తో వేతనం లభిస్తుంది.
ముఖ్యమైన తేదీలు & దరఖాస్తు విధానం..
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 03 నవంబర్ 2026 (సాయంత్రం 5:00 గంటల నుండి)
చివరి తేదీ : 18 నవంబర్ 2026 (రాత్రి 11:59 గంటల వరకు)
దరఖాస్తు రుసుము : జనరల్/OBC/EWS అభ్యర్థులకు ₹500/- ఉండగా, SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
అర్హత గల అభ్యర్థులు పవర్ గ్రిడ్ అధికారిక వెబ్సైట్ powergrid.in ని సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

