Heavy Rains in telangana, AP
* పొన్నూరులో 31.2 సెం.మీ.
*గుంటూరులో 30 సెం.మీ. వర్షం
* తుఫాన్ ఎఫెక్ట్.. అప్రమత్తంగా ఉండండి
ఆకేరు న్యూస్, డెస్క్: మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు జనజీవనాన్ని ప్రభావితం చేశాయి. పొన్నూరులో అత్యధికంగా 31.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. గుంటూరు నగరంలోనూ దాదాపు 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
* పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..
నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి…
పొన్నూరు – 31.2 సెం.మీ.
గుంటూరు – 30 సెం.మీ.
సత్తెనపల్లి – 17.9 సెం.మీ.
తెనాలి – 17.1 సెం.మీ.
బాపట్ల – 15.7 సెం.మీ.
నరసరావుపేట – 14.5 సెం.మీ.
ఏలూరు – 14.1 సెం.మీ.
చీరాల – 13.5 సెం.మీ.
* తుఫాన్ ప్రభావంతో అప్రమత్తత
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని, వర్షపు నీరు ప్రవహించే రహదారులు, వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దని సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పరిస్థితుల పర్యవేక్షణ కొనసాగుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

