CM Chandrababu
* ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించాం
* విద్యుత్ వ్యవస్థకు భారీ దెబ్బ
Chandrababu| ఆకేరు న్యూస్, డెస్క్: అర్నబ్ తుఫాన్ తీవ్రత నుంచి ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంతవరకు నివారించగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా నష్టాన్ని తగ్గించగలిగామని చెప్పారు. తుఫాన్ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు సీఎం వెల్లడించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నామని తెలిపారు. వాతావరణ పరిస్థితులు, అధికారుల సూచనలను ప్రజలకు చేరవేయడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చంద్రబాబు తెలిపారు. విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
పునరావాస కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని సీఎం వివరించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, ఇతర అవసరాల విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, అధికార యంత్రాంగం సమన్వయంతో తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

