ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
* ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Yashaswini Reddy| ఆకేరు న్యూస్, తొర్రూరు: తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. పట్టణ ప్రజల చిరకాల స్వప్నమైన ఆధునిక ఆడిటోరియం నిర్మాణ పనులను మంగళవారం ఆమె సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలపై సమీక్షించారు. నిర్మాణాన్ని నిర్ణీత ప్రమాణాలతో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఆడిటోరియం అందుబాటులోకి వస్తే తొర్రూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, సామాజిక, సాంస్కృతిక వేడుకలు నిర్వహించుకునేందుకు ఈ ఆడిటోరియం వేదికగా నిలుస్తుందని తెలిపారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదని, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ, పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని యశస్విని రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, వార్డు కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు బాపు రెడ్డి, పెద్దగాని కళావతి, సోమన్న, సంబంధిత శాఖల అధికారులు, పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

