Itlu Arjuna Movie
* ఇట్లు అర్జున’ ట్రైలర్ నేడు విడుదల
* అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం..
* నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి, తన కొత్త బ్యానర్ వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నవంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నవంబర్ 4న ‘ఇట్లు అర్జున’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
* ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్ పోస్టర్..
తాజాగా విడుదల చేసిన పోస్టర్లో అనీష్ కారు నడుపుతూ సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఆయన పక్కన కూర్చున్న అనస్వర రాజన్ టెన్షన్‌తో కనిపిస్తున్నారు. పగిలిపోయిన కారు అద్దం, గాల్లో ఎగురుతున్న గాజు ముక్కలు, వాహనాన్ని వెంబడిస్తున్న వ్యక్తులు పోస్టర్‌కు ఉత్కంఠను జోడించాయి. హీరోహీరోయిన్ల జీవితాల్లో చోటుచేసుకోబోయే అనూహ్య పరిణామాలపై ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
* మౌనంగా ప్రేమించే అర్జున్ కథ..
‘ఇట్లు అర్జున’ ఓ విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది. అర్జున్ అనే మూగ యువకుడు తన జీవితమంతా కీర్తిని మౌనంగా ప్రేమిస్తుంటాడు. అయితే, తన మనసులోని భావాలను మాటల ద్వారా వ్యక్తపరచలేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు కథను ఆసక్తికరమైన మలుపుల వైపు తీసుకెళ్తాయి. ప్రేమ, హాస్యం, సాహసం, ఊహించని ట్విస్టులతో ఈ సినిమా సాగనుంది.
సాంకేతికంగా రాజా మహదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా పరిచయం అవుతున్నారు. తమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. నవంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

