Secunderabad - Kagaznagar Special Trains
* వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి
* పండుగ ప్రయాణాలకు ఊరట..
* ఖాళీ సీట్ల వివరాలు ప్రకటించిన SCR
* ట్రైన్ టికెట్ దొరకడం లేదా
* ఈ స్పెషల్ రైళ్లలో బెర్తులు అందుబాటులో
ఆకేరు న్యూస్, డెస్క్: రైలు ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను వెల్లడించింది. దీంతో కన్ఫర్మ్ టికెట్లు దొరకక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది. దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ నెలలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర ప్రాంతాలకు వెళ్లే పలు ప్రత్యేక రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 6వ తేదీ రాత్రి 8 గంటల సమయానికి సేకరించిన వివరాలను రైల్వే అధికారులు ప్రకటించారు.
ఏ రైళ్లలో ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయంటే
ఢిల్లీ వెళ్లే ప్రయాణికుల కోసం చర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు నడిచే 07023 నంబర్ ప్రత్యేక రైలులో నవంబర్ 24న 254 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్రయాణికులకు చర్లపల్లి నుంచి నడిచే 04122 నంబర్ రైలులో నవంబర్ 24న 207 బెర్తులు, డిసెంబర్ 1న 293 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. బీహార్ వెళ్లే ప్రయాణికుల కోసం కూడా పలు రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నాయి. జాల్నా నుంచి ఛప్రాకు వెళ్లే 07651 నంబర్ రైలులో నవంబర్ 25న 220 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. చర్లపల్లి నుంచి ససారంకు వెళ్లే 07041 నంబర్ రైలులో నవంబర్ 26న 507 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. అలాగే చర్లపల్లి నుంచి బరౌనీకి వెళ్లే 07588 నంబర్ ప్రత్యేక రైలులో నవంబర్ 15న ఏకంగా 861 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. చర్లపల్లి నుంచి దానాపూర్‌కు వెళ్లే 07051 నంబర్ రైలులో నవంబర్ 23న 83 బెర్తులు అందుబాటులో ఉన్నాయి.
నాందేడ్, సిర్పూర్ ఖాజీపేట మార్గాల్లోనూ ఖాళీలు
హెచ్ఎస్ నాందేడ్ నుంచి పాట్నాకు వెళ్లే 07609 నంబర్ ప్రత్యేక రైలులో నవంబర్ 10న 187, నవంబర్ 17న 412, నవంబర్ 24న 517 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. చర్లపల్లి నుంచి రక్సౌల్‌కు వెళ్లే 07007 నంబర్ రైలులో నవంబర్ 18న 212, నవంబర్ 25న 329 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ ఖాజీపేటకు వెళ్లే 07711 నంబర్ రైలులో నవంబర్ 8న 438, నవంబర్ 9న 551, నవంబర్ 10న 547 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. తిరుగు ప్రయాణంలో సిర్పూర్ ఖాజీపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చే 07712 నంబర్ రైలులో నవంబర్ 7న 535, నవంబర్ 8న 543, నవంబర్ 9న 76, నవంబర్ 10న 453 బెర్తులు అందుబాటులో ఉన్నట్లు రైల్వే వెల్లడించింది.
ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచన
ప్రత్యేక రైళ్లలో బెర్తుల ఖాళీ వివరాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే కొద్దీ అందుబాటులో ఉన్న బెర్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణం చేయాలనుకునేవారు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

