మాజీ మంత్రి ఆర్కే రోజా
* రీకౌంటింగ్‌పై తీవ్ర ఆరోపణలు
* ఇల్లత్తూరులో రాజకీయ ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, డెస్క్: చిత్తూరు జిల్లా విజయపురం మండలం ఇల్లత్తూరు MPTC ఎన్నికల ఫలితం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. రీకౌంటింగ్‌లో ఫలితం తారుమారైందంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఆందోళనకు దిగారు. కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
10 ఓట్ల మెజారిటీ నుంచి 3 ఓట్ల ఓటమి!
తొలుత జరిగిన ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి ఉదయగిరి దేవి 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారని రోజా తెలిపారు. అయితే రీకౌంటింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి జయప్రద 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
కౌంటింగ్ సిబ్బందిపై ఆరోపణలు
రీకౌంటింగ్ సమయంలో వైసీపీ అభ్యర్థిని బలవంతంగా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారని రోజా ఆరోపించారు. అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయం చేయాలంటూ కంటతడి
కౌంటింగ్ కేంద్రం వద్దే బైఠాయించిన రోజా.. మరోసారి నిష్పక్షపాతంగా రీకౌంటింగ్ నిర్వహించాలని కోరారు. తమ పార్టీ అభ్యర్థికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రోజా నిరసనతో ఇల్లత్తూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

