* ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరు
* షరతులు విధించిన సుప్రీంకోర్టు
* బెయిలు ఆర్డర్ లో కీలక అంశాలు
* 153 రోజులుగా తీహార్ జైలులోనే కవిత
* సోదరిని విడిపించేందుకు ఆటో ఎక్కిన కేటీఆర్
ఆకేరు న్యూస్ డెస్క్ : దాదాపు ఐదు నెలలుగా జైలు జీవితం.. బెయిలు కోసం ఎన్నో పిటిషన్లు.. మరెన్నో ప్రయత్నాలు.. రోజుల తరబడి ఎదురుచూపులు.. ఎట్టకేలకు కవితకు బెయిల్ లభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె(KCR DAUGHTER), బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు సుప్రీం కోర్టు(SUPRIM COURT) ద్విసభ్య ధర్మాసనం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసు(DELHI LIQUOR CASE)లో కవితను అరెస్టు చేసి నేటికి 164 రోజులు కాగా ఆమె జ్యుడిషీయల్ కస్టడీలో భాగంగా 153 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. ఈరోజు కోర్టులో జరిగిన వాదనల్లో ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. దీంతో దాదాపు 165 రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు.
ఆమెకు ఆ అర్హత ఉంది..
బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని.. ఛార్జ్ షీట్ కూడా దాఖలైందని ఈ దశలో కవితను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయడింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ కు బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపింది. గతంలో ఢిల్లీ హైకోర్టు(DELHI HIGHCOURT) ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. సెక్షన్ 45పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది. ఒక మహిళ విద్యాధికురాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్(BAIL) నిరాకరించడం సరికాదని తెలిపింది. ఈ మేరకు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే షరతులు విధించింది. పాస్‌పోర్టును మెజిస్ట్రేట్‌కు సరెండర్ చేయాలి. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, కేసు ట్రయల్‌కు సహకరించాలని, విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని కవితను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
సోదరి కోసం కేటీఆర్ తాపత్రయం
తన సోదరి కవితకు బెయిల్ రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ (BRS)కార్యాలయంలో కేటీఆర్(KTR) సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్(MLA KP VIVEKANADA GOUD), శ్రీనివాస్ గౌడ్(SRINIVAS GOUD) తదితరులను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బెయిలు పత్రాలతో తీహార్ జైలుకు కారులో పయనం అయ్యారు. భారీ ట్రాఫిక్ జాం కావడం.. జైలుకు సమయం ముగుస్తుందన్న ఆదుర్దాతో కారును పక్కన ఆపేసి.. ఆటో(AUTO)లో పయనం మొదలుపెట్టారు కేటీఆర్(KTR). నువ్వు.. ఎక్కడ ఉన్నా.. నీ కోసం నేనుంటా అంటూ రాఖీ సందర్భంగా ఎమోషనల్ పోస్టు పెట్టిన కేటీఆర్.. ఇప్పుడు ఆమెను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి కేటీఆర్ ఉరుకులు పరుగులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
—————————————