పెరుమాండ్ల రామకృష్ణ
* వేమ్ నరేందర్ రెడ్డిపై విమర్శలు తగవు
* డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
Perumandla Ramakrishna| ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, రచయిత కంచె ఐలయ్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని పేర్కొన్నారు. కంచె ఐలయ్యపై తమకు గౌరవం ఉందని, అయితే వాస్తవాలు తెలుసుకోకుండా ఒక ప్రజానేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
ప్రజా సేవలో అంకితభావం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేమ్ నరేందర్ రెడ్డి అత్యంత నమ్మకమైన సహచరుడిగా ఉంటూ అంకితభావంతో పనిచేస్తున్నారని రామకృష్ణ కొనియాడారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
విమర్శలు చేస్తే ఊరుకోం
వరంగల్ జిల్లా నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకుడిపై వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం బాధాకరమని రామకృష్ణ అన్నారు. వేమ్ నరేందర్ రెడ్డిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో, చట్టబద్ధంగా స్పందిస్తామని స్పష్టం చేశారు.
వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
రాజకీయాల్లో విమర్శలు, అభిప్రాయ భేదాలు సహజమని, అయితే అవి వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించకుండా ఉండాలని రామకృష్ణ సూచించారు. కంచె ఐలయ్య తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

