ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
* చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్, పాలకుర్తి: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క పేద కుటుంబం కూడా మెరుగైన వైద్యానికి దూరం కాకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 40 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్‌ను పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా కుటుంబ సభ్యురాలిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, హమ్య నాయక్, ఉళ్లేంగుల యాదగిరి, మురళి, నర్సయ్య, సమ్మయ్య నాయక్, యూత్ మండల అధ్యక్షుడు కళ్యాణ్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

