రైలు–ప్లాట్‌ఫామ్ మధ్య పడిపోయిన చంద్రయ్య
* రైలు–ప్లాట్‌ఫామ్ మధ్య పడిపోయిన చంద్రయ్య
* అప్రమత్తంగా స్పందించి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు రైలు (Train), ప్లాట్‌ఫామ్ (Platform) మధ్యలో పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (Railway Protection Force – RPF) పోలీసులు వెంటనే స్పందించి అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పోలీసుల సమయస్ఫూర్తితో ప్రయాణికుడి ప్రాణాలు నిలిచాయి.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల (Mancherial) జిల్లాకు చెందిన చంద్రయ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్‌ప్రెస్ (Godavari Express) రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే రైలు కదలడం ప్రారంభించడంతో అదుపుతప్పి ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్యలో పడిపోయాడు.
ఈ ఘటనను గమనించిన ఆర్పీఎఫ్ పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే స్పందించి చంద్రయ్యను రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య నుంచి బయటకు లాగి సురక్షితంగా కాపాడారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరోసారి గుర్తుచేసింది. కదులుతున్న రైళ్లను ఎక్కడం, దిగడం అత్యంత ప్రమాదకరమని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. రైలు పూర్తిగా ఆగిన తర్వాతే ఎక్కాలని, తొందరపాటుతో ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

