ఆది జాంబవ మాదిగ మహారాజుల శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
* భారీగా ఏర్పాట్లు..!
* తరలిరావాలని మండల మాదిగ జాగృతి సంఘం పిలుపు
ఆకేరు న్యూస్, రాయపర్తి : మాదిగల సాంస్కృతిక శక్తి, ఐక్యత, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే లక్ష్యంతో వరంగల్లో ‘ఆది జాంబవ మాదిగ మహారాజుల శోభాయాత్ర’ (Madiga Maharajula Shobhayatra) నిర్వహించనున్నట్లు రాయపర్తి మండల మాదిగ జాగృతి సంఘం నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త డా. విశారదన్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
* ఈ నెల 22న శోభాయాత్ర..
ఈ శోభాయాత్ర నవంబర్ 22న నిర్వహించనున్నారు. పోచమ్మైదాన్ జంక్షన్ నుంచి ప్రారంభమై వరంగల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్, హన్మకొండ వరకు శోభాయాత్ర (Madiga Maharajula Shobhayatra) కొనసాగనుంది. కార్యక్రమానికి మాదిగ మహారాజులు, మహారాణులు, విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత, మేధావులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
* భారీగా తరలిరావాలని పిలుపు..
మాదిగల అస్తిత్వం, సంస్కృతి, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే ఈ మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని రాయపర్తి మండల మాదిగ జాగృతి సంఘం పిలుపునిచ్చింది. కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో తరలివచ్చి శోభాయాత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గారే వెంకటస్వామి మహారాజ్, బూడిద సునీల్ మహారాజ్, బూడిద అశోక్ మహారాజ్, ఎల్పుగొండ గణేష్ మహారాజ్, చిర్ర ఎల్లయ్య మహారాజ్ తదితరులు పాల్గొననున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

