యువకుడి దారుణ హత్య
* సూర్యాపేట జిల్లా వెంపటిలో ఘటన
* గుర్తుతెలియని వ్యక్తుల కత్తులతో దాడి
* ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు
ఆకేరు న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్తున్న ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం తుంగతుర్తి (Tungaturthi Murder) మండలం వెంపటి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చామకూరి మహేశ్ (25) ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
* ట్రాక్టర్‌పై వెళ్తుండగా దాడి..
స్థానికుల సమాచారం ప్రకారం.. మహేశ్ శుక్రవారం ఉదయం తన వ్యవసాయ భూమి వద్దకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో తీవ్రంగా గాయపడిన మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.
* ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
* పాత కక్షల కోణంలోనూ దర్యాప్తు..
పట్టపగలే గ్రామంలో (Tungaturthi Murder) యువకుడు హత్యకు గురికావడంతో వెంపటిలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు పాత కక్షలే కారణమా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read : కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో చోరీ..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

