దొంగను పట్టుకున్న గ్రామస్థులు
* దొంగను పట్టుకున్న గ్రామస్థులు!
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో పట్టపగలే చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఓ ఇంట్లో చోరీ (Theft) చేసేందుకు ప్రయత్నిస్తున్న గుర్తుతెలియని వ్యక్తిని స్థానికులు గమనించారు.
వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, ఓ స్తంభానికి కట్టేశారు. అనంతరం పోలీసులకు (Police) సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
జనావాసాల మధ్య పట్టపగలే చోరీకి యత్నించడం గ్రామస్థుల్లో ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ (Investigation) చేపట్టారు. నిందితుడి వివరాలు, చోరీ యత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

