Rega Kalyani
* సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ పొందాలి
ఆకేరు న్యూస్, ములుగు: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ప్రకటించిన రూ.500 బోనస్‌ను పొందాలని ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి సూచించారు.
ఆదివారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయి, మొద్దులగూడెం, దుంపెళ్లిగూడెం, రాంనగర్ గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ (IKP) ద్వారా ఏర్పాటు చేసిన వానాకాలం (ఖరీఫ్) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేగ కల్యాణి మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ప్రభుత్వం సన్న వడ్లకు అందిస్తున్న క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పైడాకుల కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ (INTUC) జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

