
* తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్
* అత్యవసరమైతేనే బయటకు రండి
* మీ కుటుంబసభ్యుడిగా సినీ నటుడు చిరంజీవి సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎడతెరిపిలేని వానలకు ఇప్పటికే తెలంగాణ (Telangana) ఆగమాగం అవుతోంది. ఎటూపోలేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్(Adilabad), నిర్మల్(Nirmal), నిజామాబాబాద్(NIjamabad), కామారెడ్డి(Kamareddy), మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగురు కొత్తగూడెం, కమ్మం, వరంగల్(Warangal), హన్మకొండ, జనగామ సహా మిగతా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వరదల ప్రభావం ఎక్కువగా ఉంది..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావం ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కోరారు. మీ కుటుంబసభ్యుడిగా నా మనవి ఒక్కటే. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని కోరుతున్నా. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి విప్తతులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధతులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఉంటారని ఆశిస్తున్నాను.. అని చిరు ట్వీట్(Tweet) చేశారు.