* ఖమ్మం జిల్లాలో దారుణం
ఆకేరున్యూస్, ఖమ్మం : వరద ఉధృతికి దంపతులు కొట్టుకుపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులకథనం మేరకు.. కూసుమంచి మండలంలోని నాయకన్ గూడేనికి చెందిన దంపతులు పాలేరు వాగులో చిక్కుకుని గల్లంతయ్యారు. దంపతులు షేక్ యాకూబ్, భార్య సైదాబీ గల్లంతయ్యారు. కొట్టుకుపోతున్న దంపతుల కుమారుడు షరీఫ్ ను పోలీసులు రక్షించారు.