ఏపీ. అనంతపురం జిల్లాలో విషాదం
ఆకేరున్యూస్, (ఏపీ) అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు మండలం యగ్నిశెట్టిపల్లిలో రీల్స్ చేసే సరదాలో శనివారం యువకుడు క్వారీలో జారిపడి మృతి చెందాడు. హిందూపురం పట్టణం బాలాజీ నగర్‌కు చెందిన మహమ్మద్ కైఫ్ (22) సభ్యులతో కలిసి యగ్నిశెట్టిపల్లి సమీపంలోని క్యారీకి వెళ్లారు. కుటుంబ సభ్యులంతా అక్కడ పొలాల్లో ఉన్నారు. గట్టుపైన కొంత మంది బంధువులు వీడియో తీస్తుండగా.. మహమ్మద్ కైఫ్ నీటిలోకి దిగి విన్యాసాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.