ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో మరోసారి ప్రత్యేక విడత ప్రవేశాలు ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 11న సీట్లు కేటాయిస్తామని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు సీట్లు పొదని వారు మాత్రమే ఈ ప్రత్యేక విడతకు అర్హులని చెప్పారు.
————————–