* విజయవాడ నుంచి కొనసాగుతున్న రైళ్ల రాకపోకలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల సమీపంలో పలుచోట్ల ట్రాక్ ధ్వసం అయిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ – హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టిన రైల్వే అధికారులు ట్రాక్ మరమ్మతు పనులు పూర్తి చేశారు. తొలుత విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్ ప్రెస్ గుంటూరు, వరంగల్ మీదుగా హైదారబాద్ చేరుకుంది. అప్‌లైన్ లో సర్వీసులు పునరుద్ధరించామని, డౌన్ లైన్ లో బుధవారం అర్ధరాత్రికి పనులు పూర్తి చేస్తామని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
——————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
