Murder in Lalaguda Young man murdered
* Lalaguda వినాయక మండపం వద్ద యువకుడి హత్య
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాలాగూడ (Lalaguda) పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపం వద్ద కార్తీక్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి కార్తీక్‌ను హతమార్చినట్లు సమాచారం.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ యువతి తన ప్రియుడితో వెళ్లిపోవడంలో కార్తీక్ సాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అప్పటి నుంచి కార్తీక్‌పై కొందరు వ్యక్తులు కోపంతో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే కార్తీక్‌తో గొడవ జరిగి, చివరకు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు అసలు కారణం, నిందితులు ఎవరన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
