* లైంగకదాడి ఆరోపణలపై చర్యలు
* అతడి నుంచి నాకు ప్రాణహాని : బాధిత మహిళ
ఆకేరు న్యూస్, విజయవాడ : టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం(TDP MLA KONETI ADHIMULAM)పై లైంగికదాడి ఆరోపణలపై పార్టీ స్పందించింది. అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఆ మహిళ చేస్తున్న ఆరోపణలు నిజమా, కాదా దర్యాప్తు చేయాలని ఇద్దరు మంత్రులకు అధిష్ఠానం బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆదిమూలం తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని హైదరాబాద్(HYDERABAD)లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బాధితురాలు మీడియాతో వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, తనపై ఎమ్మెల్యే మూడుసార్లు లైంగికంగా ఘాతుకానికి పాల్పడ్డాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. తనకు వందసార్లు కాల్ చేశాడని, తన వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని పేర్కొంది. ప్రజల చేత, ప్రజా శ్రేయస్సు కొరకు ఎన్నుకోబడ్డ ఓ ఎమ్మెల్యే మహిళలను లైంగికంగా వేధించడం తగదని బాధిత మహిళ భర్త పేర్కొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
