* భారతీయ జనతాపార్టీకి భారీషాక్
ఆకేరు న్యూస్ డెస్క్: హర్యానా(HARYANA) అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ(BJP)కి భారీ షాక్ తగిలింది. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడంతో రంజిత్ సింగ్ చౌతాలా(RANJITHSING CHOWTHALA) మంత్రి పదవికి రాజీనామా చేశారు. సిర్సా జిల్లాలోని రానియా(RANIA) నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన రంజిత్ సింగ్ చౌతాలా ఈ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, బీజేపీ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఆ స్థానం పార్టీ అభ్యర్థిగా శిష్పాల్ కాంబోజ్(SISPHAL KAMBOJ)ను ప్రకటించింది. దీంతో కినుక వహించిన రంజిత్ సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రానియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మీడియాతో వెల్లడించారు.
——–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
