* ప్రభుత్వం ఆ జీవోను సవరించింది : హోంమంత్రి అనిత
ఆకేరు న్యూస్, విజయవాడ : వినాయక మండపాలకు ఏపీ ప్రభుత్వం(AP GOVERNMENT) డబ్బులు వసూలు చేస్తోందన్న ప్రచారంపై హోంమంత్రి అనిత (HOME MINISTER ANITHA) స్పందించారు. 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారని తెలిపారు. వినాయక మండపాలకు ప్రభుత్వం ఎటువంటి చలాన్లనూ విధించడం లేదని, గతంలో మైక్ సెట్లకు వసూలు చేసే చలాన్లను కూడా రద్దు చేసిందని వివరించారు. మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవోను జగన్(JAGAN) ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు (CM CHANDRABABU)దృష్టికి ఈ విషయం రాగానే, రూపాయి కూడా వసూలు చేయవద్దని ఆదేశించారని వివరించారు. అయినప్పటికీ, వైసీపీ పేటీఎం బ్యాచ్ విషప్రచారం చేస్తోందని ఆరోపించారు.
——————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
