* ఎమ్మెల్యేలపై చర్యలకు నాలుగు వారాల గడువు
* స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై హైకోర్టు(HIGH COURT) కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్(DANAM NAGENDAR), కడియం శ్రీహరి(KADIAM SRIHARI), తెల్లం వెంకట్రావుల(TELLAM VENKATRAO)పై చర్యలు తీసుకోవాలని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి(PADI KOUSIKREDDY), కేపీ వివేకానంద(KP VIVEKANANDA) వేసిన అనర్హత పిటిషన్లను హైకోర్టు ఈ రోజు సోమవారం విచారించింది. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని పేర్కొంది. నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోని పక్షంలో తామే సుమోటాగా కేసు స్వీకరించి విచారణ జరపుతామని హెచ్చరించింది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
—————————-