Published:
Updated: 10 Sep 2024 • 09:40 AM

ఆకేరున్యూస్, వరంగల్: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నెల 9న కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహాచారి ఆదివారం ప్రకటించారు. బీ ఫార్మసీ రెండో సెమిస్టర్ తో పాటు ఇతర పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు తెలిపారు. తిరిగి ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా, సెప్టెంబర్ 10వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
—————————————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
