* గతంతో పోలిస్తే 30శాతం తగ్గిన కాలుష్యం
* నల్గొండ జిల్లాకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డు
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో ఆక్సీజన్ నాణ్యత గతంలో కంటే 30శాతం మెరుగుపడింది. నల్గొండ జిల్లాలో కూడా వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పరిధిలోని 131 నగరాల్లో 95 నగరాలు గాలి నాణ్యతలో మెరుగుదల సాధించాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రస్తుత నివేదిక తెలిపింది. హైదరాబాద్, నల్గొండతో పాటు ఏపీలోని ఎనిమిది నగరాల్లోనూ గాలి నాణ్యత మెరుగైందని పేర్కొంది. ఇంటర్ నేషనల్ ఎయిర్ క్లీన్ డే సందర్బంగా జైపూర్లో శనివారం నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ -2024 కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ అవార్డులను ప్రదానం చేసింది. 3లక్షలలోపు జనాభా గల నగరాల్లో గాలి నాణ్యత మెరుగుదలలో నల్లగొండ జిల్లా రెండో స్థానం దక్కించుకుంది. దీనిలో భాగంగా నల్గొండ మున్సిపాలిటీకి రూ.25లక్షల నగదు పురస్కారం అందించారు. కేంద్ర మంత్రి భూపేందర్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ చేతులమీదుగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ అవార్డు స్వీకరించారు.
—————————-