* మరో సరికొత్త ప్రాజెక్టుతో ప్రభాస్ రెడీ
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : బాహుబలి తర్వాత కథల ఎంపికలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(REBAL STAR PRABHAS).. మరో క్రేజీ ప్రాజెక్టుతో సిద్ధంగా ఉన్నాడు. కల్కి (KALKI)2898తో బ్రహ్మాండమైన విజయం అందుకున్న ప్రభాస్ అనంతరం సీతారామం డైరెక్టర్ హనురాఘవపూడి(HANU RAGHAVAPUDI) దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ను ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ద్వారా ఇమాన్వీ హీరోయిన్ వెండి తెరకు పరిచయమవుతోంది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోని భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తొలి షెడ్యూల్ వచ్చే సోమవారం తమిళనాడు(TAMILANADU)లో ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్(HYDERABAD) లో సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు.
————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
