* బిల్డింగ్ పై నుంచి దూకినట్లుగా అనుమనాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మలైకా అరోరా(Malaika Arora) తండ్రి అనిల్ అరోరా(Anil Arora) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై(Mumbai)లో తాను నివాసం ఉంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఘటన జరిగినప్పుడు పూణె(Pune)లో ఉన్న మలైకా అరోరా హుటాహుటిన ముంబైకి చేరుకున్నారు. ఆయన భవనంపైకి వెళ్లి దూకేశారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనీల్ అరోరా మర్చంట్ నావీలో పనిచేశారు. 11 ఏళ్ల వయసులోనే తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని గతంలో మలైకా ఆరోరా తెలిపారు.
————————–