ఆకేరున్యూస్, హైదరాబాద్ : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చికిత్స చేయించలేక పోతున్న వారికి ఉచితంగా గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేస్తున్నట్లు నిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్న పిల్లలకు ఉచితంగా చేయనున్నారు. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రమణ ఆధ్వర్యంలో యూకేకు చెందిన వైద్య బృందం ప్రభుత్వ సహకారంతో ఈ సేవలు అందించనుంది. గుండెకు రంధ్రం, ఇతర గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు ఎవరైనా సరే ఉచితంగా ఈ సేవలు పొందవచ్చునని నిమ్స్ సంచాలకులు ప్రొఫెసర్ నగరి బీరప్ప శుక్రవారం వెల్లడించారు. మరిన్ని వివరాలకు పంజాగుట్ట నిమ్స్ లోని కార్డియోథొరాసిక్ వైద్యులను సంప్రదించాలని వారు సూచించారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
