Published:
Updated: 16 Sep 2024 • 06:21 AM
– విశ్వ విద్యాలయ పరిధిలోని అన్ని కళాశాలలు పనిచేస్తాయి
ఆకేరున్యూస్, వరంగల్ : కాకతీయ యూనివర్శిటీ క్యాంపస్, యూనివర్శిటీ పరిధి డిగ్రీ, పీజీ కళాశాలలన్నీ సెప్టెంబర్ 14 రెండో శనివారం యథావిధిగా పనిచేస్తాయని కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహాచారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున యూనివర్శిటీతో పాటు దాని పరిధిలోకి వచ్చే అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. కావున, విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు గమనించాలని సూచించారు.
—————————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
