* ఆ రంగం సంక్షోభంలో ఉంది
* ఇతర రంగాలపైనా దృష్టి పెట్టాలి
* తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనొచ్చు..
* రుణమాఫీ చేసినా రైతుల కష్టాలు తీరలే
* కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
* పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం
* ఎంఎస్ఎంఈ పాలసీ – 2024 ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వ్యవసాయరంగం(Agricultural Sector) సంక్షోభంలో ఉందని, కుటుంబంలో అందరూ వ్యవసాయానికే పరిమితం కావొద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Telangan Cm Revanthreddy) సూచించారు. వ్యవసాయం చేస్తూనే ఇతర రంగాలపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. ఒకప్పుడు కృష్ణాజిల్లాలో ఎకరం అమ్మితే, తెలంగాణలో కొన్ని ఎకరాలు కొనేలా ఉండేదని, ఇప్పుడు తెలంగాణ(Telangana)లో ఒక ఎకరం అమ్మితే ఏపీ(Ap)లో వంద ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని వివరించారు. హైదరాబాద్ శిల్పారామంలో ఆయన ఎంఎస్ఎంఈ – 2024 పాలసీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.., పీవీ, మన్మోహన్ సింగ్ (Manmohansing)గొప్ప ఆర్థిక సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు(PV Narasimharao) సోషల్ ఎకనామీకి శ్రీకారం చుట్టారన్నారు. 1994-2004 మధ్య చంద్రబాబు(Chandrababu) ఐటీ విప్లవం తీసుకొ చ్చారని వెల్లడించారు. పాలకులు మారినా.. విధానాలు కొనసాగతాయని తెలిపారు. కుటుంబంలో వ్యవసాయం కొందరే చేయాలని, మిగతా వారు చదవాలని, మంచి ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఎదిగి పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. వ్యవసాయరంగ కుటుంబానికి చెందిన వారిలో కొందరు ఇతర రంగాలపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదిగారని తెలిపారు. 2 లక్షల రుణమాపీ చేసినా రైతుల కష్టాలు తీరడం లేదని పేర్కొన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
డ్వాక్రా గ్రూపుల(Dwacra Groups) ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని రేవంత్ రెడ్డి (Revanthreddy)తెలిపారు. సమగ్ర అధ్యయనంతో ఇండస్ట్రీ అవసరాల కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఎంఎస్ ఎంఈ(SMME)లు బలపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ అందరికీ వడ్డించిన విస్తరిలా ఉందని, పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. అందుకే ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలనే ఆకాంక్ష ఉందని, ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని, అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ప్రభుత్వం గడీల మధ్య లేదని, ఎవరు ఎప్పుడైనా కలవొచ్చని సూచించారు. కాగా, ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మూసీని మారుస్తామనిన మరోసారి హామీ ఇచ్చారు. ఎంఎస్ఎంఈలలో మహిళలకు 5 శాతం, పరిశ్రమల స్థాపనంలో 15 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy Cm Battivikramarka) ప్రకటించారు.
…………………………….