కమలాపూర్ లోని బీసీ గురుకుల పాఠశాలలో మాట్లాడుతున్న టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి
* టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : గురుకుల పాఠశాలలో పని వేళలు మార్చాలని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం కమలాపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఆయన సందర్శించి పాఠశాల భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేశారు. అనంతరం యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, గురుకుల పాఠశాలలో కేర్ టేకర్లను నియమించి, బోధనా సిబ్బందిని బోధనేతర పనులకు వినియోగించవద్దని అన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఆర్ట్ ,క్రాఫ్ట్, మ్యూజిక్ లైబ్రరియన్స్, స్టాఫ్ నర్స్ ప్రమోషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా గురుకుల జేఏసీ గురుకులాల్లో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళనలు చేపడుతామని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి సమ్మె నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో యుటిఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షడు రవీందర్ రాజు,ప్రధాన కార్యదర్శి పెండెం రాజు , టిఎస్ యూటీఎఫ్ ఎం జె పి వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లివిన్ స్టన్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు సతీష్,అశోక్, మధు, సురేష్ , గణేష్ , మాధవి , స్రవంతి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
