Published:
Updated: 19 Sep 2024 • 09:32 AM
* ముక్కలు ముక్కలుగా చేసిన వైనం
ఆకేరు న్యూస్ డెస్క్ : చెన్నయ్(CHENNAI)లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన సూట్‌కేసులో ఓ యువతి మృతహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూట్ కేసు(SUITCASE)ను ఓపెన్ చేసి చూడగా, ముక్కలు ముక్కలుగా చేసిన మృతదేహం కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆ యువతి ఎవరు, ఎవరు.. ఎందుకు చంపారు అనే వివరాలపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
————
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
