Revanth Reddy
* తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలి
* 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదన
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటి కేటాయింపులు, పెండింగ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు.
తుమ్మిడిహెట్టిపై చర్చలు
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీ తర్వాత చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను పరిశీలిస్తూ, ఆదిలాబాద్ ప్రాంతంలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాలని సూచించినట్లు తెలుస్తోంది.
డిండికి 0.5 టీఎంసీలు
డిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీల నీటిని కేటాయించే అంశంపై సీఎం సమీక్షించారు. స్థానికంగా సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి కేటాయింపులు, ప్రాజెక్టు పనులపై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అచ్చంపేటకు 0.1 టీఎంసీలు
అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని కేటాయించే అంశాన్ని కూడా సమీక్షించారు. అదేవిధంగా ఏదుల రిజర్వాయర్‌కు అదనంగా 0.6 టీఎంసీల నీటిని అందించే ప్రతిపాదనపై చర్చించారు. ఆయా ప్రాంతాల్లో సాగునీటి అవసరాలను తీర్చేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పంప్‌హౌస్‌లు, పంపుల పనులను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రాజెక్టుల వారీగా పూర్తికావాల్సిన పనులను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నీటి కేటాయింపులు, అంతర్రాష్ట్ర చర్చలు, నిర్మాణ పనుల పురోగతిపై ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలు ఆయా ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాల విస్తరణకు కీలకం కానున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

