* వారి మాటలు విని జగన్ 100 మందిని మార్చారు
* అదే పార్టీ ఓటమికి కారణమైంది
* నన్ను నియోజకవర్గం మారుస్తారని ఊహించలేదని వెల్లడి
ఆకేరు న్యూస్, విజయవాడ : వైసీపీ నేత, ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పైనా, పార్టీ ఓటమిపైనా స్పందించారు. ఏపీలో పార్టీ ఓటమి అనంతరం.. కీలక నేతలు వైసీపీకి దూరమవుతున్నారు. పార్టీకి రాజీనామా చేసి కొందరు టీడీపీ గూటికి చేరితే, మరికొందరు నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. ఈక్రమంలో వైసీపీ కీలక నేత నారాయణ స్వామి కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. తాను పార్టీ మారేది లేదని, చచ్చేంత వరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పై అమిత అభిమానం ఉందన్నారు. గత ఎన్నికల్లో జగన్.. తనను మరో నియోజకవర్గానికి పంపుతారని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే మరోసారి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని భావించారని అన్నారు. కొందరి మాటలు వినే జగన్.. 100 మంది అభ్యర్థులను మార్చారని, అదే పార్టీ ఓటమికి కారణమైందని వెల్లడించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
