Pavala Shyamala Daughter Help
* మాధవి సంక్షేమ బాధ్యతలు ‘మా’వే
* నరేష్, మురళీమోహన్ చెరో రూ.50 వేల సాయం
ఆకేరు న్యూస్, సినిమా: దివంగత నటి పావలా శ్యామల కూతురు మాధవికి అండగా నిలిచేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ముందుకొచ్చింది. మాధవిని రమణాచారి ఫౌండేషన్‌లో చేర్పించి, ఆమె సంక్షేమానికి అవసరమైన సహకారం అందించనున్నట్లు ‘మా’ ట్రెజరర్ శివ బాలాజీ తెలిపారు.
మాధవి ‘మా’ సభ్యురాలు కాకపోవడంతో అసోసియేషన్ నిధులను నేరుగా వినియోగించలేమని, అందుకే రమణాచారి ఫౌండేషన్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఫుడ్, బెడ్, ఫిజియోథెరపీ వంటి అవసరాలను ఫౌండేషన్ చూసుకుంటుందని, మాధవి సంరక్షణ కోసం ‘మా’ తరఫున కేర్‌టేకర్‌ను నియమించినట్లు చెప్పారు.
* ఆర్థిక సాయం కూడా
మాధవికి సాయం చేయాలనుకునేవారు ‘మా’కు విరాళాలు అందించాలని శివ బాలాజీ కోరారు. ఇప్పటికే సీనియర్ నటులు నరేష్, మురళీమోహన్ చెరో రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
పావలా శ్యామలను ‘మా’ ఎప్పుడూ విస్మరించలేదని జనరల్ సెక్రటరీ కరాటే కళ్యాణీ అన్నారు. మాధవి తన కాళ్లపై తాను నిలబడేలా చేయడమే ‘మా’ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘మా’పై విమర్శలు చేసేవారు సైతం మాధవికి అండగా నిలవాలని కోరారు.
ఈ మీడియా సమావేశంలో ఈసీ సభ్యులు వడ్లపట్ల, మానిక్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
