Happy Journey Trailer
- ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ కథ..
- సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల
ఆకేరు న్యూస్, సినిమా: ఏడుగురు మహిళల జీవితాలు, అనుభవాల చుట్టూ తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
మనుషుల మధ్య తగ్గుతున్న అనుబంధాలు, ఒంటరితనం, కుటుంబ బంధాల నేపథ్యంలో సినిమాను రూపొందించినట్లు దర్శకుడు అభిరామ్ నాయుడు తెలిపారు. ఫోన్లో ఎన్నో నంబర్లు ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో మాట్లాడేందుకు ఎవరూ లేని పరిస్థితులను సినిమాలో చూపించినట్లు చెప్పారు.
ఏడుగురు విభిన్న నేపథ్యాలకు చెందిన మహిళల ప్రయాణమే ఈ సినిమా కథాంశమని, సినిమా మొత్తం వినోదాత్మకంగా సాగుతూ చివర్లో మంచి సందేశాన్ని అందిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. తల్లిదండ్రులపై ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తపరిచే విధానం తక్కువగా ఉండే భావోద్వేగాలను కూడా సినిమాలో చూపించినట్లు తెలిపారు.
ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక పాత్రల్లో నటించారు. ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్‌తో పాటు చిత్రబృందం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
