♦ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట నగరవాసులకు సూచించారు. బలమైన గాలులు, మెరుపులతో వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని.. వారు సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు వద్ద నీటి వనరుల చెరువులు కుంటలు పెద్ద పెద్ద నాళాల వద్ద నిలబడవద్దని కమిషనర్ సూచించారు. పిడుగుపాటు సమయంలో లోహ వస్తువులు లేదా విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించవద్దు.నిర్మాణ స్థలాలకు దూరంగా ఉండాలని కోరారు. వరదలు ఉన్న ప్రాంతాలను దాటకుండా వద్దని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ 04-2111 1111 నంబర్ సంప్రదించండి లేదా డిఅర్ఎఫ్ 9000113667లో సంప్రదించవచ్చన్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
