* రెండు నెలల క్రితం హత్యకు గురయిన తల్లిదండ్రులు
* రూ.8 లక్షలు అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్: రెండు నెలల క్రితం పదహారు చింతల తండలో భానోతు మదన్, దీపికలకు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆర్థిక చేయూతనందించారు. ఆ చిన్నారుల తల్లితండ్రులను అతి కిరాతకంగా చంపబడిన క్రమంలో అనాథలైన పిల్లలకు నర్సంపేట నెమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ నుండి ఎనిమిది లక్షల రూపాయల చెక్కును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ఉన్నత చదువులకు, భవిష్యత్తుకు, రక్షణకు అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. పిల్లలు వారి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్కు, నర్సంపేట ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియచేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
