* మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన
* ముంపు ప్రాంతవాసులకు న్యాయం చేస్తామని మంత్రుల హామీ
ఆకేరు న్యూస్, మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు ఉదయం మంత్రులు(MInisters) పర్యటించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు(Palamure-Rangareddy Project)ను సందర్శించారు. జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా బుధవారం జిల్లాలోని నార్లాపూర్, వట్టెం రిజర్వాయర్ల పనుల ను పరిశీలించారు. వచ్చే ఎన్నికలలోపు ప్రాజెక్టును పూర్తిచేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswararao)హామీ ఇచ్చారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా భూ నిర్వాసితులు మంత్రులను చుట్టుమ్టారు. బాధితులకు ఇల్లు ఇప్పిస్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
12 లక్షల ఎకరాలకు నీళ్లు : ఉత్తమ్
గత ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister uttamkumar reddy) విమర్శించారు. తాము 12 లక్షల ఎకరాకలు నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా ప్రాజెక్టులను చేపడతున్నామని తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టులను పూర్తిచేసి రైతుల సమస్యలను దూరం చేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ముంపు ప్రాంతప్రజలకు న్యాయం చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. కబ్జాలు, ఆక్రమణదారులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. మంత్రుల బృందంలో జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు కాంగ్రె స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర నేతలు ఉన్నారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
