Raaka
* అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌పై పెరిగిన క్యూరియాసిటీ
Raaka: ఆకేరు న్యూస్, డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాను నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ తాజాగా సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే అందులో కేవలం ‘37’ అనే సంఖ్య మాత్రమే కనిపించడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
37.. అసలు అర్థం ఏంటి?
పోస్టర్లో టైటిల్‌తో పాటు ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వకపోవడంతో ‘37’ సంఖ్య దేనికి సంకేతమనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 37 రోజుల్లో కీలక ప్రకటన వస్తుందా? లేదా సినిమా కథ, అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన ఏదైనా సంకేతమా? అంటూ అభిమానులు పలు రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఈ సంఖ్యకు సంబంధించిన అసలు విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.
సెప్టెంబర్ 21న ప్రకటన?
దర్శకుడు అట్లీ పుట్టినరోజు సెప్టెంబర్ 21న ఉండటంతో, ఆ రోజున ‘రాకా’ నుంచి కీలక అప్డేట్ లేదా ప్రత్యేక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై కూడా ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు.
గతంలో AA22 x A6 గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తొలి పోస్టర్లో అల్లు అర్జున్ గుండు లుక్‌తో పాటు క్లా తరహా రూపంలో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘37’ పోస్టర్‌తో మరోసారి ఆసక్తిని పెంచిన మేకర్స్.. తదుపరి అప్డేట్ ఎప్పుడు ఇస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
