Rashmika Mandanna
Rashmika Mandanna: ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్కు ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో నటి రష్మిక మందన్న నటించనున్నారు.
కుటుంబ సభ్యులతో భేటీ
సినిమా ప్రారంభానికి ముందు రష్మిక.. చిత్ర బృందంతో కలిసి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కుటుంబ సభ్యులను కలిశారు. చీర, సంప్రదాయ ఆభరణాలతో కనిపించిన రష్మిక.. కుటుంబ సభ్యులకు నమస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది.
నిస్వార్థ మద్దతుకు ధన్యవాదాలు
వీడియోను షేర్ చేసిన గీతా ఆర్ట్స్.. ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ ప్రారంభానికి ముందు ఇది ఒక అందమైన క్షణమని పేర్కొంది. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కుటుంబ సభ్యులను ప్రేమ, గౌరవం, కృతజ్ఞతలతో చిత్ర బృందం కలిసిందని తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు కుటుంబ సభ్యులు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది.
ఈ బయోపిక్కు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
