Mandakini
* వైరల్ ఫొటోపై మందాకిని క్లారిటీ
Mandakini: ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి మందాకిని, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో గతంలో వైరల్ అయిన ఫొటోపై తాజాగా స్పందించారు. దావూద్ ఆహ్వానం మేరకు తాను దుబాయ్ వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు. ఓ షోలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన సమయంలో క్రికెట్ మ్యాచ్‌కు హాజరయ్యానని, అదే సందర్భంగా ఆ ఫొటో తీసినట్లు వివరించారు.
నా చేతుల్లో ఉండదు
ఓ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మందాకిని మాట్లాడుతూ.. ఫొటో అనంతరం తనపై వచ్చిన వార్తలు, ఊహాగానాలను తాను నియంత్రించలేనని చెప్పారు. కళాకారిణిగా అనేక మందిని కలవాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరినీ విడివిడిగా చూడటం సాధ్యం కాదని పేర్కొన్నారు. తాను దుబాయ్‌కు ఓ షో కోసం వెళ్లానని, ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లానని చెప్పారు. దావూద్ తనను ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. ఎవరు ఏం రాసినా ఏం మాట్లాడినా అది తన చేతుల్లో ఉండదని పేర్కొన్నారు.
కెరీర్‌పై ప్రభావం
దావూద్‌తో ఉన్న ఫొటో చుట్టూ ఏర్పడిన వివాదం తన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని మందాకిని తెలిపారు. ఇలాంటి వివాదాలను ఎదుర్కొనేందుకు అప్పట్లో తనకు ప్రత్యేకంగా ఒక టీమ్ ఉండాల్సిందని తర్వాత అర్థమైందన్నారు. తనపై వచ్చిన పుకార్లను ఎక్కడికక్కడ ఖండించినప్పటికీ.. ఆ వివాదం తన కెరీర్‌కు చాలా నష్టం చేసిందని చెప్పారు.
రామ్ తేరీ గంగా మైలీ తో గుర్తింపు
రాజ్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్ తేరీ గంగా మైలీ సినిమాతో మందాకిని బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో గంగ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం ఆమె 75కు పైగా హిందీ చిత్రాల్లో నటించారు. అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి, గోవింద తదితర ప్రముఖ నటులతో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
