ఆకేరు న్యూస్, బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై సోమవారం ఈడీ చర్యలు చేపట్టింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఆయనకు భూమిని అమ్మిన దేవరాజుపై సెప్టెంబర్ 27న మైసూరు లోకాయుక్త నమోదు చేసిన కేసును ఈసీ పరిగణనలోకి తీసుకుని ఈడీ చర్యలకు పాల్పడిరది. ఈ నేపథ్యంలో వారిపై ఈడీ కేసు నమోదుకు ఈసీఐఆర్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్లను ఈసీఐఆర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితులకు ఈడీ సమన్లు జారీ చేసి ప్రశ్నించడంతో పాటు వారి ఆస్తులను అటాచ్ చేసే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి ఆమె సోదరుడు బహుమతిగా ఇచ్చిన భూమిని ముడా సంస్థ స్వాధీనం చేసుకుంది.
…………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
