* ఆరోజు వారి మనోభావాలు దెబ్బతినలేదా
* మా ఇంట్లో మహిళలు ఏడ్వరా
* సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేని కోసం
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వ్యాఖ్యలు, ఏడుపులపై మాజీ మంత్రి కేటీఆర్ (Ktr) స్పందించారు. కొండా సురేఖ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకోసమని ప్రశ్నించారు. గతంలో కొండా సురేఖ మాట్లాడిన బూతులను గుర్తుచేసుకోవాలని అన్నారు. ఇదే సోషల్మీడియా(Social Media) ద్వారా, మా కుటుంబాన్ని, మమ్మల్ని కూడా ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. ఆ సమయంలో తమ ఇంట్లో మహిళలు బాధపడలేదా అని ప్రశ్నించారు. వాళ్లు ఏడవరా అని అన్నారు. సురేఖపై తమ పార్టీ తరఫున ఎవరూ ట్రోల్ చేయలేదన్నారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)లు చేశారంటూ ఆరోజు సురేఖ మాట్లాడిన మాటలకు వారి మనోభావాలు దెబ్బతినలేదా అని గుర్తు చేశారు. సురేఖ హీరోయిన్లపై అలాంటి ఆరోపణలు చేయడం వల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతినవా, తమ ఇంట్లో ఆడవాళ్లు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని అన్నారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. హీరోయిన్లు కూడా మహిళలే అని, ఆచితూచి మాట్లాడాలని సూచించారు. సురేఖ వ్యాఖ్యలపై తమ పార్టీ స్పందిస్తుందని వెల్లడించారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
