
* మెగాస్టార్ చిరంజీవి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: వార్తల్లో నిలిచేందుjశీ కొందరు సినీ ప్రముఖల పేర్లు వాడుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని చిరంజీవి తెలిపారు. ‘వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖల పేర్లు వాడుకుంటున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా.. అసత్య ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు. రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని ఆయన ట్వీట్ చేశారు.
……………………………