* నేషనల్ అవార్డు తీసుకోవడానికి వెళ్లేందుకు అనుమతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) ను రంగారెడ్డిజిల్లా కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఇప్పటికే ఆయనను నార్సింగి పోలీసులు నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించి.. అతడి నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. అనంతరం చంచల్ గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు. ఇదిలా ఉంటే తనకు ఐదు రోజుల మధ్యంతర బెయిల్(Bail) మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్ తరపు న్యాయవాది. ఢిల్లీ(Delhi)లో ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకే తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని జానీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈమేరకు పరిశీలించిన కోర్టు ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు(National Award) తీసుకునేందుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
