* హైడ్రాపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతపై గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసిన మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. జీహెచ్ఎంసీ(Ghmc) ఆఫీస్, సెక్రటేరియట్(Secrateriat), ప్రముఖుల ఘాట్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. వాటిని కూడా కూల్చేస్తారా, ఎఫ్టీఎల్లో ఉన్న ప్రభుత్వ భవనాల మాటేంటి అని అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్లో నిర్వహించిన సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం ఉందని మర్చిపోవద్దని చెప్పారు. అలాగే.. ప్రధాని మోడీ(Modi) పాలనలో ముస్లిం మైనార్టీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఆయన ప్రసంగాలు వినే ఉద్దేశం లేకనే తాను పార్లమెంటుకు వెళ్లలేదని చెప్పారు. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఒక్క ముస్లిం ఎంపీ లేరని గుర్తుచేశారు. బీజేపీ(BjP ప్రభుత్వం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కనుసన్నల్లో నడుస్తుందన్నారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
